అజ్మీరా చందూలాల్(66) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం అనా రోగ్యంతో బాధపడుతూ హైద రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ములుగు జిల్లా జగ్గన్నపేట పేట గ్రామానికి చెందిన చందులాల్ ఎన్టీఆర్, కేసీఆర్ క్యాబినె ట్లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు శాస నసభకు, రెండుసార్లు లోక్ సభకు చందూలాల్ ఎన్నిక య్యారు. 2014 లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియో జకవర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు. తండ్రి ప్రోత్సాహంతో ఆయన కుమారుడు ప్రహ్లాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. చందూలాల్ మృతి పట్ల పలువురు మంత్రులు నాయకులు సంతాపం తెలిపారు