మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శ

చల్లా కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శ

నందిగామ నగర పంచాయితీ: 02 జనవరి 2021

నందిగామ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నేత చల్లా మోహన్ రావు గారి భార్య చల్లా పద్మావతి గారు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. కాగ శనివారం నాడు టౌన్ లో మోహన్ రావు స్వగృహంలో పద్మావతి గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.