మాజీ మంత్రి బొజ్జల చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఎర్రబెల్లి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ69 శ్రీకాళహస్తి/పాలకుర్తి మే08
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి లోని బొజ్జల ఇంటికి ఆదివారం రోజు మంత్రి దయాకర్ రావు వెళ్ళారు.బొజ్జల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బొజ్జల గోపాలృష్ణారెడ్డి అంటే తనకు ఎంతో గౌరవమని, ఇద్దరూ దాదాపు ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించామన్నారు.
శ్రీకాళహస్తి లో 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల,ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో అటవీశాఖ మంత్రిగా,ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రిగా పనిచేసారన్నారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.