మాజీ రాజ్యసభ సభ్యులు వి.హన్మంత రావు అరెస్ట్ అప్రజాస్వామికం

మాజీ పీసీసీ అధ్యక్షులు,మాజీ రాజ్యసభ సభ్యులు వి.హన్మంత రావు అరెస్ట్ అప్రజాస్వామికం

అరెస్ట్ కి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ 2వ గేట్ దగ్గర భారీ రాస్తారోకో

ఎన్.ఎస్. యు.ఐ,వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ లో చేపట్టిన రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన డానికి వరంగల్ కి వస్తున్న మాజీ పిసిసి అధ్యక్షులు,మాజీ రాజ్యసభ సభ్యులు వి. హన్మంతరావు, గారినీ జనగామలో అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసనగా కాకతీయ యూనివర్సిటీ 2వ గేట్ దగ్గర కరీంనగర్ – వరంగల్ హై వే పై రాస్తారోకో నిర్వహించడం జరిగింది,పోలీస్ ల వైఖరి నీ నిరసిస్తూ రోడ్డు పై పడుకొని నిరసన తెలిపారు,
ఈ సంధర్భంగా వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ

రైతులపట్ల కెసిఆర్ ద్వంద వైఖరి వీడాలి,ఢిల్లీ వెళ్లి వచ్చాక కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ప్రజలకు సమాదానం చెప్పాలి,
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఎన్.ఎస్. యు.ఐ,విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరాహార దీక్షలను కూడా తెరాస ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు,
రైతుల పట్ల కెసిఆర్ స్పష్టమైన వైఖరిప్రకటించాలి.
రైతులు చేపట్టిన దేశవ్యాప్త బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే కెసిఆర్ వైఖరి మారిందా స్పష్టం చెయ్యాలని అన్నారు,

ఎన్.ఎస్. యు.ఐ రాష్ట్ర అద్యక్షులు బల్ముర్ వెంకట్ గారు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరని, విద్యార్థి సంగాల ఆధ్వర్యంలో శాంతి యుతంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనకుండా వి.హన్మంతరావు గారిని,కాంగ్రెస్ నాయకులను అరెస్టులు,విద్యార్థులు,మేధావులు, ప్రజాస్వామిక వాదులు,ప్రజలు,అక్రమ అరెస్ట్ లనుఖండించాలనిపిలుపునిచ్చారు,కే యు జాక్ నాయకులు మంద వీరాస్వామి,మంద భాస్కర్ లు సంఘీభావం తెలిపారు,
కె యు పోలీస్ లు
కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఈ కార్యక్రమం లో,ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లకొండ సతీష్, ఎన్ ఎస్ యు ఐ కో ఆర్డినేటర్ మార్క అభినయ్ గౌడ్,అజిత్ రెడ్డి,ప్రేమ చంద్ వెలం దాస్,కే.యు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రణధీర్,వరంగల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్వాల కార్తిక్,నాయకులు పల్లె రాహుల్ రెడ్డి,తోట పవన్,సాయిరాం యాదవ్, టీపీసీసి సెక్రెటరీలు కొత్తపెళ్ళి శ్రీనివాస్,మీసాల ప్రకాష్, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ లు పుప్పాల రజనీకాంత్,దుబ్బ శ్రీనివాస్, మైనారిటీ డిపార్ట్మెంట్ జిల్లా అద్యక్షులు అయుబ్,కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షులు కంధికొండ చిన్న రాజు,ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్ యాదవ్, మహిళా కాంగ్రెస్ గ్రేటర్ అద్యక్షులు బంక సరళ బొంత సారంగం,మహిళా కాంగ్రెస్ నాయకులు మేరీ,కాంగ్రెస్ డివిజన్ అద్యక్షులు నల్ల సత్యనారాయణ,ఎర్ర.మహేందర్,సదానందం గౌడ్,మండల సమ్మయ్య,వల్లపు.రమేష్,గన్నరపు సంగీత్, కర్ణా కర్,సంతోష్,పృథ్వి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.