గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతిచెందిన పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం.గారి భార్య చిట్యాల భారతి గారు మృతి చెందడంతో బుధవారం బుధవారం రోజున సిపిఎం మరియు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రామచంద్ర గారిని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి రాజు నరేష్. సిపిఎం జిల్లా నాయకులు భూక్యా చందు నాయక్. చిట్యాల సోమన్న. సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు మాచర్ల సారయ్య. సోమ సత్యం. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండలాధ్యక్షులు చిట్యాల సమ్మయ్య. కార్యదర్శి ఏదూనూరి మదర్ తదితరులు పాల్గొన్నారు.
