రెవెన్యూ అధికారుల ద్వారా ల్యాండ్ కేటాయింపు పత్రాలను అందుకున్న జిల్లా రజక సంఘం కమిటీ సభ్యులు
గత రెండు సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా రజక సంఘంకు మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారి సహకారంతో జిల్లా రజక సంఘం భవనం మరియు పట్టణ రజకులకు ఆధునిక ధోభిఘాట్ నిర్మాణం కోసం మెదక్ పట్టణంలో కేటాయించిన(మార్కెట్ కమిటీ యార్డు వెనుకాల) 1-32, (ఒక ఎకరా 32 గుంటల) ప్రభుత్వ భూమిని జిల్లా రెవెన్యూశాఖ అధికారుల ద్వారా మన రజక సంఘం జిల్లా కమిటీ సభ్యులకు ల్యాండ్ కేటాయింపు ప్రొసీడింగ్ పేపర్ లను పంచనామా నిర్వహించి అందించారు ,హ్యాండెడ్ ఓవర్ చేయగా జిల్లా రజక సంఘం నాయకులు టేకెన్ ఓవర్, చేసుకున్నారు,మన రజక సంఘం ఆధీనంలోకి స్వీకరించారు…. త్వరలోనే ఈ స్థలంలో జిల్లా రజక భవన్,ధోభిఘాట్ నిర్మాణం కోసం శంఖుస్థాపన చేసే అవకాశం ఉంది.ఈ కార్యక్రమంలో మన రజక సంఘం రాష్ట్ర రజక ఉద్యోగ సంఘం అధ్యక్షులు వర్సపల్లి నర్సింహులు,జిల్లా యూత్ అధ్యక్షుడు మల్లారెడ్డి పేట విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు దొంతి గోపాల్, రజక సంఘం ఉపాధ్యక్షుడు చౌదరి మల్లేశం,రజక వెల్ఫైర్ కమిటీ సభ్యులు బక్కవారి గణేష్,తో పాటు జిల్లా రజక సంఘం కమిటీ సభ్యులు పోచయ్య పాల్గొన్నారు