#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

హైదరాబాద్ నుండి మహబూబాబాద్ కు మానుకోట యంపి మాలోత్ కవిత వస్తున్న క్రమంలో పురుషోత్తమాయగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఓ..యువకుడు రోడ్డుపై పడి ఉండడాన్ని యంపి కవిత గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి హుటాహుటిన ఆ..ప్రాంతానికి చేరుకున్నారు. ఆటో-ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పడమటి తండాకు చెందిన వినోద్ గా గుర్తించారు. ఏరియా ఆసుపత్రి మహబూబాబాద్ కి అంబులెన్స్ లో తరలించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రామ్ తో మహబూబాబాద్ ఎంపీ, తెరాస జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఫోన్ లో మాట్లాడి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. పోలీస్ అధికారులతోనూ మాట్లాడి విషయం వివరించారు. తక్షణమే స్పందించిన యంపి కవితకు ఘటనాస్థలంలో ఉన్న ప్రజలు దన్యవాదాలు తెలిపారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.