మానవత్వం పరిమళించిన మానుకోట పోలీసులకు వందనం

అసలే కరోనా కాలం.. మనిషిని చూస్తే.. మనిషే భయపడి దూరంగా జరుగుతున్న పాపిష్టి సమయం..!! ఇలాంటి పరిస్థితుల్లో ఓ..అనాదమృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానుకోట పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ..అనాదమహిళ మూడురోజుల క్రితం వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయింది.. పోలీసులు గుర్తించి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. కానీ అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. ఎవరైనా ఆమె కోసం వస్తారో..ఏమో అని ఆసుపత్రి మార్చురీలోనే మృతదేహాన్ని ఉంచారు.. పాపం.. ఆ..అభాగ్యురాలికోసం అయిన వారెవ్వరూ రాలేదు. దీంతో అనాదమృతదేహానికి అంతిమసంస్కారం నిర్వహించే బాద్యతను పోలీసులే తీసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ సిఐ వెంకటరత్నం.. మానవత్వంతో స్పందించారు..!! ఎస్ఐ సంతోష్ కుమార్, కానిస్టేబుల్ మోహన్ రాజు లతో కలిసి అనాధ శవాన్ని శ్మశానవాటికకు తరలించారు. పూలమాలవేసి నివాళులు అర్పించి మృతదేహాన్ని ఖననం చేసారు.. అనాదమృతదేహానికి అన్నీ తామే అయ్యి అంతిమసంస్కారాలు నిర్వహించిన *సిఐ వెంకటరత్నం, ఎస్ఐ సంతోష్ కుమార్, కానిస్టేబుల్ మోహన్ రాజు ల మానవత్వానికి.. మహబూబాబాద్ పోలీసుల మంచిమనుసుకు సలాం

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.