మానసిక దివ్యాంగులకు ఉచిత కిట్ల పంపిణీ

మేధోపరమైన వైకల్యం” కలిగిన పిల్లలకు కు బోధనోపకరణాల ద్వారా విద్యను అందించి చదువులో ప్రతిభ కనపరిచేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి గారు శ్రీ K. అశోక్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల సూర్యాపేటలో నిర్వహించిన మానసిక దివ్యాంగుల ఉచిత కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కిట్లను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా తల్లిదండ్రులు మరియు సహిత విద్యా రిసోర్స్ టీచర్లు చూడాలని తెలియజేశారు.
తెలంగాణ సమగ్ర శిక్ష మరియు NIEPID వారి సహకారంతో జరిగిన ఉచిత TLM కిట్ల పంపిణీ కార్యక్రమంలో NIEPID ఒకేషనల్ ఇన్స్పక్టర్ శ్రీ P.రాజేందర్ మాట్లాడుతూTLM కిట్లను వినియోగించుకోవడం వలన పిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంటుందని తెలియజేశారు . ఈరోజు జిల్లాలో 24 కిట్లను ఉచితంగా అందిస్తున్నామని ఒక్కో కిట్ ధర రూ.10,000-00 ఉంటుందని ఒక్కో కిట్ లో పన్నెండు రకాల వస్తువులు ఉంటాయని సూర్యాపేట జిల్లా సమ్మిలిత విద్యా సమన్వయ కర్త యర్రంశెట్టి.రాంబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో సూర్యాపేట జిల్లా బుక్ డిపో మేనేజర్ శ్రీమతి గోలి.పద్మ ఇనూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్లు మరియు NIEPID విద్యార్ధులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.