మామనరావు దంపతుల హత్యను ఖండించిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ

న్యాయవాది మామనరావు దంపతుల హత్యను ఖండించిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డా. సామల శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి హత్యలు, కిడ్నాపులు, అత్యాచారాలు భూకబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం విఫలమవుతోందని సామాన్య ప్రజలకు సైతం రక్షణ లేకుండా పోతోందని ఫోరం ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు తెలంగాణ ఉద్యమకారుల జే.ఏ.సి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులు బలిదానాలతో సంవత్సరాల తరబడి చేసిన పోరాటాల ఫలితంగా నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మన బంగారు తెలంగాణలో రోజు రోజుకీ ఇలాంటి దారుణాలు ఘోరాలు చూడడానికేనా అని వాపోయారు. నిన్న మిట్టమధ్యాహ్నం మంథిని ప్రధాన రహదారిపై న్యాయవాది వామనరావు దంపతులను అతి కిరాతకంగా విచక్షణ లేకుండా కత్తులు గొడ్డలితో నరికి చంపడం చాలా బాధాకరం. మనిషిలో మానవత్వం విలువల్ని పక్కన పెట్టి క్రూర మృగాల కన్నా కఠినంగా నేడు కొందరు మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చాలా దారుణమైన విషయం మరి ఇలాంటి మృగాలని మనుషుల మధ్య లో స్వేచ్ఛగా తిరగం ఇవ్వకుండా వెంటనే వారికి తగిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని కోరుకుంటున్నాను అలాగే వామనరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని వామనరావు దంపతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.