సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్.

మార్చి 26న భారత్ బంద్ ను జయప్రదం చేయండి. సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ,ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని విద్యుత్ బిల్లులు ఉపసంహరించాలని మార్చి 26న జరిగే భారత్ బందును విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. వెంగల్ రావు నగర్ డివిజన్ మధుర నగర్ లో బంద్ కరపత్రం విడుదల చేసిన సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తూ కేంద్రం తెచ్చిన మూడు చట్టాల వలన కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది ఆదని ,అంబానీ ,రిలయన్స్ ,టాటా, బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయి అని రైతులు క్రమంగా వ్యవసాయం నుండి వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు .ఈ చట్టాల్లో కనీస మద్దతు ధర లేకపోవడం సిగ్గుచేటని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న 300 పబ్లిక్ సెక్టార్ లను అమ్మాలని ప్రయత్నిస్తోందని ప్రజల ఆస్తులను పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పజెబుతుంది. విశాఖ ఉక్కు, ఎల్ఐసి, రైల్వే, బ్యాంకులు ప్రైవేటు కట్టబెట్టడం ద్వారా ఉన్న ఉద్యోగాలు కుదించడానికి ప్రయత్నిస్తోందన్నారు. రోజు ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ ,డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని ధరలు పెరుగుతున్నాయి కావున పెట్రోల్ డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని ,అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు రాములు, ఏసు ,శ్రీనివాస, రజినీకాంత్ ,లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.