మార్చి 28 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా విస్రృత సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు బోట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ
: కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఆవలభిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేయాలని దేశాన్ని రక్షించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దారిద్ర్య రేఖ దిగువన తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు నగదు ఇవ్వాలని అన్నారు కార్మికులకు కనీస వేతనం నెలకు 26000 చెల్లించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పెరిగిన నిత్యావసర సరుకుల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అన్ని కార్మిక సంఘాలు యూనియన్లు అసంఘటిత సంఘటిత ఉద్యోగ కార్మికులు అన్ని రంగాలకు చెందినవారు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరారు ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పుప్పాల శ్రీకాంత్ సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు , జిల్లా నాయకులు జోగు ప్రకాష్ బెల్లంకొండ వెంకటేష్ చిట్యాల సోమన్న నారోజు రామచంద్రు తాండ్ర ఆనందం యాతం సమ్మయ్య మల్లేష్ రాజ్ నల్ల తీగల శ్రీనివాస్ రాగల్ల అంజయ్య కళ్యాణి అన్నపూర్ణ చీర శ్రీనివాస్ మైబెల్లి సిద్ధం సోమయ్య సాకి నర్సింగం తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.