మార్నింగ్ వాకర్స్ తో ఓటు ప్రచారం

జనగామ పట్టణంలో మార్నింగ్ వాకర్స్ తో వాకింగ్ చేస్తూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్న వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారది రెడ్డి

రంగులు మార్చే రాజకీయ పార్టీ నాయకుడిని కాదు. నికార్సయిన జర్నలిస్టును తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అంశాల పట్ల సమగ్ర అవగాహన కలిగిన వాడిగా శాసనమండలి ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర ఉద్యోగ కార్మిక సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జనగామ పట్టణం లోని బతుకమ్మ కుంట గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యాపార నిరుద్యోగ యువకులను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నా ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారది రెడ్డి….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని అన్నారు .ఒక కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చాయి తప్ప పోరాడిన ప్రజలకు ఏమి దక్కలేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే గడిచిన ఆరు సంవత్సరాల కాలంగా భర్తీ చేయని కేసీఆర్ నేడు జరుగుతున్న MLC ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ నియామకాల పేరుతో నాటకానికి తెరలేపారని అన్నారు .ప్రాజెక్టుల రీజనింగ్ చేసి లక్షల కోట్ల దుర్వినియోగం రాష్ట్రంలో జరిగిందని అన్నారు.
రాష్టం విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 60 వేల కోట్ల అప్పుఉంటే అరుసంవత్సరాల కెసీఆర్ పాలనలో నేడు రెండున్నర లక్షల కోట్లు అప్పు దాటిందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని నేడు ఉద్యోగులకు పిఆర్సి పేరుతో దోబూచులాట అడుతు పదోన్నతులు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు . తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ కూడా నియమించారని దౌర్భాగ్య స్థితిలో పరిపాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ దిగ్గజాలకు అప్ప చెబుతున్నాడని ప్రభుత్వ రంగాన్ని దివాలా దించి ప్రైవేటు రంగాన్ని అభివృద్ధి పరిచే పనిలో ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు శక్తులకు అప్పజెప్పి ఏజెన్సీ గా మారిందని దుయ్యబట్టారు .
దేశంలో ప్రైవేటు రంగం అభివృద్ధి ఐతే రిజర్వేషన్స్ ఉండవని రిజర్వేషన్స్ లేకపోతే నిరుగ్యోగం మంతపెరిగి అరాచకం పెరిగె ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదారి పట్టించేందుకు భావోద్వేగాలను రెచ్చగొట్టి మతం పేరుతో కులం పేరుతో ప్రజలను చీల్చి పరిపాలన సాగిస్తున్నరని తెలిపారు.
విభజన చట్టంలో పొందు పర్చిన విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ములుగు లో గిరిజన యూనివర్సిటీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు వచ్చే అవకాశం ఉండదని తద్వారా వ్యాపార వాణిజ్య రంగాలు అభివృద్ధి చెంది అనుబంధ పరిశ్రమలు ఏర్పడి ఎంతో అభివృద్ధి కావడానికి అవకాశం ఉన్నదని అన్నారు.ఈ విషయం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ అడగలేదని కేంద్ర బిజెపి ఇవ్వట్లేదని అన్నారు.దీనికోసం మండలిలో నేను మాట్లాడి పోరాడుతామని అలాగే వామపక్షాలు ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తానని మండలంలో ప్రశ్నించే గొంతునై పనిచేస్తానని అందుకోసం నాకు అవకాశం ఇచ్చి రానున్న శాసన మండలి ఎన్నికలలో మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకూ కనకా రెడ్డి cpi జిల్లా కార్యదర్శి ch రాజారెడ్డి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సీపీఎం నాయకులు md దస్తగిరర్ జోగు ప్రకాష్ న్యాయవాదులు సాదం జంపన్న బద్రీనాథ్ గద్దల అమృతరావు రిటైర్డ్ ఉపాధ్యాయులు గూడ రాజా బోసు ఆవాజ్ (మైనార్టీ) జిల్లా నాయకులు MD అజార్ వివిధ ప్రింట్ ఎలక్ట్రానిక్ పాత్రికేయలు వృత్తి సంఘాల నాయకులు కళ్యాణం లింగం ఎస్ఎఫ్ఐ నాయకులు దాడిగా సందీప్ DYFI నాయకులు బొట్ల శ్రావణ్ కర్రే రాములు తదితరులతోపాటు వాకర్స్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.