జఫర్గడ్ ఎస్సై కె.కిశోర్
మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో రోజు రోజుకు కరోన కేసులు పెరుగుతున్నందున మండల ప్రజలు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకొని సామాజిక దూరం పాటించాలని ఎస్సై కె.కిశోర్ గారు తెలిపారు.
మండలం కరోన కేసులు అధికంగా నమోదు అవుతున్న దృశ్యా వారు సాగరం క్రాస్ రోడ్డు వద్ద తనికీలు నిర్వహించి అక్కడి ప్రజలకు అవగాహన నిర్వహించారు.
ఎస్సై గారు మాట్లాడుతూ…మండలంలో రోజు రోజుకు కరోన కేసులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మండల ప్రజలు అంతా దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాలకు ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని,సామాజిక దూరం పాటిస్తూ,వ్యక్తిగత శుభ్రత పాటించి కరోన నుండి రక్షించుకోవాలని కోరారు. ఇప్పటి నుండి అన్నీ గ్రామాల్లో ప్రజలు మాస్కులు పెట్టుకొని,సామాజిక దూరం పాటించాలని లేని యెడల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా అన్నీ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు బాధ్యతలు తీసుకుని తమ తమ గ్రామాలను కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
