మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా- ఎస్ ఐ కే శ్రీనివాసులు

మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా- ఎస్ ఐ కే శ్రీనివాసులు

  • గ్రామస్థాయి నుండి చైతన్యం రావాలి
  • సర్పంచులు చాటింపు వేసి కరోనాపై చైతన్యం తేవాలి
  • మునగాల ఎస్సై కె.శ్రీనివాసులు వెల్లడి

మునగాల E69 వార్త:దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తోందని,ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతోందని మునగాల ఎస్సై కె.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం మునగాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఒకవేళ ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి తప్పకుండా వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించడం ఖాయమని, గత వారం రోజులుగా వైరస్ భీకర రూపం దాల్చిందని, దేశంలో రోజుకు రెండున్నర లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. ఇప్పుడప్పుడే కరోనా అంతమవ్వదని, సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ఉంటుందని, దేశంలోని 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తవడం, హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకునే వరకు ఇలాంటి మరిన్ని వేవ్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించి తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఇమ్యూనిటీ ఉన్న వారు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే సామర్థ్యం కొత్త మ్యూటేటెడ్ వైరస్‌కు ఉందని,అందుకే టీకా తీసుకున్న వారికీ కరోనా రావడాన్ని చూస్తున్నాం అని అన్నారు. సెకండ్ వేవ్‌లో కరోనా చాలా స్పీడ్‌గా ఇన్ఫెక్ట్ అవుతుందని, కరోనా పాజిటివ్ వ్యక్తికి కాంటాక్ట్ అయిన వారికి 15 నిమిషాల్లోనే వైరస్ సోకుతుందని, ఊబకాయం, మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫ్రూట్, వెజిటబుల్ జ్యూస్‌‌లు, కొబ్బరినీళ్లు లాంటివి తాగుతూ ఉండాలని అన్నారు.
మాస్కులు తప్పకుండా ధరించాలి, పాదాచారులు,వివిధ వాహనాలపై వెళ్తున్న ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు. మొదట వచ్చిన కరోనా వ్యాధి కంటే సెకండ్ వేవ్ లో ఉన్న కరోనా తీవ్రత ఎక్కువైందని, మాస్కుల ద్వారా మాత్రమే కరోనా వ్యాధి అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ఎవరైనా మాస్కులు ధరించని యెడల వారికి తప్పకుండా వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించడం ఖాయమని అన్నారు. అంతే గాక గ్రామస్థాయి నుండి మాస్కులు ధరించే విషయంలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఎవరైనా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న తప్పకుండా వారు మాస్కులు ధరించి రావాలని, లేని యెడల వారికి తప్పకుండా వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించడం ఖాయమని అన్నారు. అంతేకాకుండా మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న వ్యాపారవేత్తలు, హోటల్ యజమానులు, దుకాణ దారులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలు మాసుక్ లేనిదే విక్రయాలు జరపరాదని గట్టిగా హెచ్చరించారు. అవసరమైతే వారి వారి దుకాణాలలో, కార్యాలయాలలో ఉన్న సిసిటివి ఫుటేజీలో సైతం పరిశీలించి మార్పు లేని వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. గ్రామాలలో ఉన్న సర్పంచులు, ప్రజా ప్రతినిధులు చాటింపు ద్వారా గాని, వివిధ రకాల సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయడానికి ముందుండాలని వారు కోరారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి
మండలంలోని రద్దీ ప్రదేశాల్లో గాని, దేవాలయాల్లో గాని, మసీదుల వద్ద గాని, చర్చిలలో గాని ప్రజలు గుమిగూడి ఉండడం వలన కరోనా వైరస్ త్వరగా వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి ప్రదేశాలలో తప్పకుండా బౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ లు వాడాలని ఆయన తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాలను కోవిద్ నిబంధనలను పాటిస్తూ జరుపు కోవాలని తెలిపారు. మాస్కులు ధరించేటప్పుడు గడ్డం మీద గానీ, ముక్కు మీద గాని పెట్టకుండా తప్పకుండా పూర్తిగా ముక్కు,మూతి కవర్ అయ్యేటట్లు ధరించాలని సూచించారు.
40సంవత్సరాలు నిండిన వారు టీకాలు వేయించుకు నేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పాజిటివ్‌ వచ్చి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్య ఆరోగ్యశాఖ సలహాలు, సూచనలు అందించాలని సూచించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.