జఫర్గడ్ ఎస్సై కె.కిశోర్

జఫర్గడ్ ఎస్సై కె.కిశోర్

  1. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులమేరకు మరియు వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ సర్ గారి ఆదేశాలమేరకు మండల ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాల కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య ఘణనీయంగా పెరుగుతున్నాయి.అదే విధంగా మండల పరిధిలో కూడా కరోన కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కరోనా వ్యాధిని నియంత్రించడం కేవలం మాస్క్ ద్వారా సాధ్యపడుతుంది.కావున ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ లను ధరించాల్సి వుంటుంది.ఎవరైనా మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినట్లయితే వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకోబడుతాయి.ఈ నిబంధనలు ఏప్రిల్ 30వ తేది వరకు అమలులో ఉంటాయి.

ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందిచాలి.అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, నిర్వహించవద్దు.గుంపులగా ఉండకూడదు.ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనలను అనుసరించి మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యపడుతుంది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.