జఫర్గడ్ ఎస్సై కె.కిశోర్

జఫర్గడ్ ఎస్సై కె.కిశోర్
మండలంలో కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున స్థానిక ఎస్సై కె.కిశోర్ గారు వారి సిబ్బందితో ప్రతి రోజు మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ,కరోన భారిన పడకుండా బ్యానర్లతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.దానిలో భాగంగా ఈ రోజు మండలంలోని ఉప్పుగల్,కూనూర్, కొనాయిచలం గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే మాస్కులు పెట్టుకోని వ్యక్తుల నుండి 14000రూ జరిమానాలు విధించారు.అదే విధంగా నిన్నటి రోజున 10000రూ జరిమానాలు విధించారు.ఉప్పుగల్ గ్రామంలో ఎస్సై గారు మాట్లాడుతూ…మండలంలో కరోన పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించుకొని,భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటించి కరోన భారిన పడకుండా రక్షించుకోవాలని తెలిపారు.ముఖ్యంగా మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తే తప్పనిసరి జరిమానా విధించి, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదే విధంగా ఇవాళ ఉదయం మండలంలోని రఘునాథపల్లి గ్రామంలో కరోనతో ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందని,ఎవరూ దగ్గరకు వచ్చే పరిస్థితి లేనందున స్థానిక సర్పంచ్ గారు కొందరి సాయంతో వారే స్వయంగా శవాన్ని ట్రాక్టర్ లో వేసుకుని వెళ్లి ఊరు బయట గోయి లో వేయడం జరిగిందని అన్నారు.ఇలాంటి పరిస్థితి ఎవరికి రావొద్దని,చాలా బాధాకరం అని తెలిపారు.ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని కోరారు.అంతే కాకుండా ఇవాళ్టి నుండి అన్ని గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు గ్రామాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా దండోరాలు వేయించాలని తెలిపారు. ముఖ్యంగా యువత మాస్కులు పెట్టుకొని, సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.కార్యక్రమాల్లో ఎస్సై గారితో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు,అధికారులు,
గ్రామస్తులు,పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.