మా రైతుల హక్కుల కోసం ఎంతకైనా పోరాడుతాం
డోర్నకల్ నియోజకవర్గ సన్నహక సమావేశంలో నియోజకవర్గ యువజన నాయకులు డీఎస్ రవిచంద్ర గారు.
కేంద్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపుతున్న వివక్షను వీడకుంటే మరో ఉద్యమానికి సిద్ధమని డోర్నకల్ యువజన నాయకుడు డీఎస్ రవిచంద్ర అన్నారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం లో భాగంగా మరిపెడ మండలకేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సన్నహక సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ యువజన నాయకులు డీఎస్ రవిచంద్ర ప్రసంగం రైతులు, పార్టీ శ్రేణులలో నూతనోత్తేజాన్ని నింపింది.
డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ గారి సారధ్యంలో మరో న్యాయ పోరాటానికి శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా ఏడేళ్ల సుపరిపాలన లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చారన్నారు.
వలసలు తగ్గి రాష్ట్ర రైతులు పచ్చగా ఉంటే బిజేపి ప్రభుత్వానికి కళ్ళు మండుతున్నాయి ధ్వజమెత్తారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం.రైతుల హక్కులతో దోబూచులాట మొదలెట్టిందన్నారు.
ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వడ్లు కొనమంటే బియ్యం కొట్టామని చెప్పడం సిగ్గు చేటన్నారు.
పోరాటాలు సీఎం కేసీఆర్ గారికి, రాష్ట్ర ప్రజలకు కొత్త కాదని హెచ్చరించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఎడ్పించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు
