జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని రేగొండ మండలం దమ్మన్నపేట,కనిపర్తి,నాగులపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల,ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్య నారాయణ రావు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు లేకుండా పెంచుతూ పేదల రక్తం తాగుతున్నాయి అని రైతులు కష్ట పడి పండిచిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను ఆగం చేస్తున్నాయి అని ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని, రాబోయి ప్రభుత్వం కాంగ్రెస్ అని రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై,రైతులకి రుణమాఫీ పై తొలి సంతకం అని రాబోయి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, గుటోజు కిష్టయ్య,మేకల బిక్షపతి,గ్రామ కమిటీ అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.