వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్.వి. మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో ముజామిల్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో 8 వ వార్డు నుండి భారీగా మైనార్టీలు చేరిక
నగరంలోని 8 వ వార్డు కు చెందిన యువకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్.వి.మోహన్ రెడ్డి గారి సమక్షంలో ముజామిల్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు మెచ్చి పార్టీ లో చేరారు.శభాష్ ఖాన్, ఇర్ఫాన్, సమీర్, నౌషాద్, ఖాలీల్,మహబూబ్, జవీద్ మరియు వారి మిత్ర బృందానికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం బడుగు జీవుల అభ్యున్నతి అని అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంచార జాతుల డైరెక్టర్ షరిఫ్,యస్.సి,యస్.టి సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు శశిధర్ భూషపొగు, వై.యస్.ఆర్ పార్టీ నాయకులు జి.ఎం. సైఫుద్దీన్, రసూల్ ఖాన్,షేక్షా,ఆరిఫ్ లు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.