మునుగోడు ప్రజల గోడు పట్టించుకునేది ఎవరు?

అనుకున్నదే జరిగింది మొదటినుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాడిన పాట నిజమైంది గత కొన్ని రోజులుగా ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం రాత్రి హైదరాబాదులో విలేకరుల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే గత మూడున్నర సంవత్సరాలనుండి మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క పైసా కూడా కేటాయించలేదని దానికి నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఉప ఎన్నిక దీనికి పరిష్కారం అన్నట్లు తాను బిజెపిలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై అభివృద్ధి కొనసాగిస్తానని వెల్లడించారు ఇక్కడ ఒక విషయం అర్థం కావడం లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు తన నియోజకవర్గానికి అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని అనుకుందాం దానికి అయిన కాంగ్రెస్కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరాలి కానీ ఇక్కడ అధికారంలో లేని భారతీయ జనతా పార్టీ లో చేరడానికి సుముఖంగా ఉన్నారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి శాసనసభ్యులుగా గెలిచిన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే అభివృద్ధి నిధులు మళ్లీ ఎలా తెచ్చుకోగలుగుతారు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన అవి నేరుగా శాసనసభ సభ్యుని కోటా కిందకు రావు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు నియోజకవర్గానికి ఖర్చు చేయాల్సి వస్తుంది టిఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం ఏమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి ఒక విధంగా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో నట్టేట ముంచి నట్లు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఉంది ఇక నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసము స్వలాభ ఆర్జిత సంపాదన కోసము ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు మరో ఏడాదిన్నర కాలంలోపు జరగాల్సి ఉంది ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చి గెలిచిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ఉంటాడా అంటే అదీ లేదు ఇప్పుడు రాజకీయ పార్టీల బలాలు ఆదిపత్య పోరు ప్రజల్లో నిరూపించుకోవడానికి అన్నది సత్యం గెలిచిన వ్యక్తి కేవలం 16నెలల పాటు శాసన సభ్యునిగా కొనసాగుతాడు ఈ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో పాగా వేయాలనుకున్న భారతీయ జనతా పార్టీకి ఈ ఉప ఎన్నిక ఒక బూస్టర్ల పనిచేస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి

పోయిన చోటే వెతుక్కునే పనిలో కాంగ్రెస్

పెసర చేనులో పోగొట్టుకొని పప్పు గిన్నెలో వెతుకులాడటం కన్నా పోయిన చోటే వెతుక్కునే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన అరగంటలోపే ఏఐసీసీ నుండి మునుగోడు క్యాంపెయిన్ అభ్యర్థుల జాబితాని విడుదల చేసింది రానున్న ఉప ఎన్నికల్లో అక్కడ ప్రచార బాధ్యతల్ని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలను నియమించింది ఈనెల 5వ తేదీన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది దీనిలో భాగంగా రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు

సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన తెరాస

నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలపై అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది గత పది రోజుల క్రితం నియోజకవర్గం లో గట్టుపల్ మండల కేంద్రంగా ప్రకటించింది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి సారధ్యంలో పెండింగ్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా ప్రభుత్వం పాలు కదుపుతుంది గత మూడు నాలుగు నెలల నుండి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఖాయమని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందింది దాని తగ్గట్టుగాని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మునుగోడులో పర్యటిస్తూ టిఆర్ఎస్ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నారు

భాజపా వ్యూహం ఫలించేనా!

ఈ ఉప ఎన్నికలలో గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీ మునుముందు తెలంగాణలో పాగా వేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తుందటంలో ఎలాంటి సందేహం లేదు గత రెండు సంవత్సరాల నుండి జరిగిన రెండు ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మొండి చెయ్యి ఎదురైందని చెప్పాలి దుబ్బాక హుజురాబాద్ రెండు కూడా టిఆర్ఎస్ పార్టీ స్థానాలు ఈ రెండు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభము ఎదురైంది అయితే ఈసారి ఉప ఎన్నికల ఫలితాలను గుణపాఠం గా తీసుకొని మంత్రి జగదీష్ రెడ్డి సారథ్యంలో తిరిగి మునుగోడులో కారును గెలిపించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది మరోమారు ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలను కాబట్టి అసెంబ్లీలో నాలుగవ R ను ప్రవేశపెట్టాలని భాజపా భావిస్తుంది ప్రస్తుతం రాజాసింగ్ రఘునందన్ రావు రాజేందర్(R R R) రాజగోపాల్ రెడ్డి ఎన్నికైతే ముచ్చటగా నలుగురు ఆర్ఆర్ ఆర్ ఆర్ లు తమకు తమ పార్టీ తరఫున ప్రాతినిధ్యం ఇస్తారని బిజెపి భావిస్తుంది ఏది ఏమైనా మునుగోడు ప్రజల గోడును పట్టించుకునే నాధుడు ఎవరని మునుగోడు ప్రజలు భావిస్తున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.