మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం డైరీని ఆవిష్కరించిన కొత్త లక్ష్మణ్ పటేల్

తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం డైరీని మహబూబాబాద్ పట్టణంలో స్థానిక లయన్స్ క్లబ్ లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మున్నూరుకాపు జర్నలిస్టుల ఫోరమ్ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరుకాపు జర్నలిస్టులను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఓ ఫోరంలాగా ఏర్పాటు చేయటానికి తనకు రెండేళ్ళు పట్టిందని అన్నారు.కేవలం తమ కుల జర్నలిస్టులను గౌరవించుకోవడం కోసమే ఈ ఫోరం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.ఇటీవల మార్చి 25 వ తేదీన మా ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్నూరుకాపు కుల బంధవుల మధ్య ఈ డైరీని ఆవిష్కరించటం జరిగిందన్నారు.రాబోయే రోజుల్లో మున్నూరుకాపు కుల సంఘం ఆధ్వర్యంలో తమ కులంనుండి జర్నలిస్టు వృత్తిలో ఉన్న ప్రతిఒక్కరికి బీమా సౌకర్యoతో పాటు జిల్లా కన్వీనర్ ల కోరిక మేరకు మున్నూరు కాపు జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు. అనంతరం మున్నూరుకాపు జర్నలిస్ట్ సభ్యులను కుల పెద్దలు శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఉంగరాల.సమ్మయ్య రాష్ట్ర పబ్లిసిటీ ఇంచార్జ్ యాంశాని. శ్రీనివాస్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు నీలం శ్రీను ,మార్నేనివెంకన్న, మార్నేని రఘు, తుంపిల్ల. శ్రీనివాస్, చందా గోపి, జెన్నరెడ్డి వెంకటేశ్వర్లు, కమటం గణేష్,మీడియా మిత్రులు,పద్మం మహేష్,రామరాజు ప్రవీణ్,నల్లకుంట్ల కరుణాకర్, పద్మం విక్రాంత్,బొబ్బ. రాజ శేఖర్ ,రాహుల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.