మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చల్ల హరిశంకర్ గౌరవ తెలంగాణ రాష్ట్ర పొరసరఫరాలు మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారిని కలిసి పూల మొక్కను ఇచ్చి కృతజ్ఞతలు తెలియ చేశారు.
వీరితో పాటు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య గారు, రాష్ట్ర అపెక్స్ కమిటీ కన్వీనర్ పుత్తం పురుషోత్తం రావు పటేల్ గారు, కరీంనగర్ కార్పొరేటర్ బండారి వేణు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్యం వెంకటేశ్వర్లు, కోశాధికారి విష్ణు జగత్, రాష్ట్ర జర్ణలిస్ట్ ల ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, కాపు సంఘం రాష్ట్ర నాయకులు వినోద్ మరియు మిగతా రాష్ట్ర మున్నూరు కాపు సంఘ ప్రతినిధులతో కలిసి మంత్రి గారి నివాసంలో మంత్రి గారిని కలిశారు.
ఈ సందర్భంగా చల్ల హారిశంకర్ గారు మాట్లాడుతూ తనను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంపీ( రాజ్య సభ) వద్దిరాజు రవిచంద్ర గారికి, అధ్యక్షులు కొండా దేవయ్య గారికి, అపెక్స్ కమిటీ కన్వీనర్ పుత్తం పురుషోత్తం రావు గారికి మిగితా అపెక్స్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియ చేశారు.
