మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్సులు ఇవ్వాలి సిఐటియు డిమాండ్


కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత ఏడు నెలలుగా పెండింగ్ లోఉన్న హెల్త్ అలవెన్సులు వెంటనే ఇవ్వాలని సి ఐ టి యు జిల్లా నాయకురాలు నిర్మల నగర ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్ చేశారు సిఐటియు నగర నాయకులు రాముడు అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు రు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా పారిశుద్ధ కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కష్టపడి పని చేసి నా నా గత ఏడు నెలలుగా హెల్త్ అలవెన్సులు ఇవ్వకపోవడం సిగ్గుచేటైన విషయమని అన్నారు కరోనా వారియర్స్ కు ప్రోత్సాహ లు ఇస్తామని చెప్పే పాల కులు చప్పట్లతో సరి పెట్టారని విమర్శించారు వివిధ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వడానికి మాత్రం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు పారిశుద్ధ కార్మికులు ఎక్కువ శాతం దళితులు అనగారిన వర్గాలు ఉన్నారని రెండు రోజుల్లో పెద్ద పండగ వాళ్ళ ముందు ఉండగా ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పండగ చేసుకునే అవకాశం వారికి కల్పించకపోవడం సరైంది కాదని అన్నారు కావున వెంటనే ప్రభుత్వం స్పందించి హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కర్నూలు నగరంలో ఏడవ డివిజన్లో కార్మికుల పై పని భారం పెరిగిందని కార్మికుల సంఖ్య తక్కువ ఉంది అనే పేరుతో కార్మికులపై అధిక పని భారం వేయడం సరైంది కాదని కార్మికుల సంఖ్య పెంచుకునేవారకు పాత పద్ధతిలోనే పని చేయించాలని డిమాండ్ చేశారు ఒక మైక్రో పాయింట్ లో నలుగురు కార్మికులు పని చేయాల్సి ఉండగా కేవలం ఇద్దరితో పని చేస్తూ పనిభారం పెంచారని అన్నారు స్కానింగ్ మిషన్లు పని చేయకపోయినా ఒకటికి పది సార్లు స్కానింగ్ చేయమని పై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు చెత్త వేసే డబ్బాలను ఎత్తివేయడం వల్ల కార్మికుల చాలా ఇబ్బంది పడుతున్నారని అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని కావున చెత్త డబ్బాలను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారం కాకపోతే కార్మికులు సమ్మెకు సిద్ధం అవుతారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రోసి పారిశుద్ధ కార్మికులు మునిస్వామి సుభద్రమ్మ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.