మురికి వాడల అభివృద్ధి కోసం కృషి చేస్తా- ఎమ్మెల్యే నన్నపునేని

37 వ డివిజన్ పరిధి లోని గిరిప్రసాద్ నగర్, బుడిగజంగాల కాలనీ, మోయిన్ పురా, ఎం.ఎం నగర్ లకు చెందిన కాలనీ ల వాసులు, నాయకులు ఆయా మురికి వాడల అభివృద్ధి కోరుతూ వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని కలిసి సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలు అందజేసారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మురికి వాడల అభివృద్ధి కి కృషి చేస్తానని, తానే స్వయంగా (శుక్రవారం) ఉదయం 37 వ డివిజన్ లోని గిరిప్రసాద్ నగర్,బుడిగజంగాల కాలనీ, ఎం.ఎం నగర్,మోయిన్ పురా లలో పర్యటిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిప్రసాద్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎండి. ఉల్ ఫత్,బుడిగజంగాల కాలనీ అధ్యక్షులు పస్తం బిక్షపతి, ఎం.ఎం నగర్ అధ్యక్షుడు సింగారపు ఏలీయా, మోయిన్ పురా నాయకులు ఫిరోజ్, నాయకులు రబ్బానీ, సరోజన, శ్రీనివా స్, రాజు, శివ, నరేష్, సారంగం, బాగ్య, చిన్ని తదితరులు పాల్గొన్నారు. 11:34 am

నిర్వాహకులు మాత్రమే సందేశాలను పంపగలరు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.