ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీ ఏరియా లో దేశవ్యాప్త సమ్మె

ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీ ఏరియా లో గల వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు ఈ రోజు 28 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇండస్ట్రియల్ ప్రాంతంలో వివిధ సంస్థలో పని చేస్తున్న మహిళా కార్మికులు,
సి ఐ టి యు, అనుబంధం సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారుగా వందమంది మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సి ఐ టి యు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి గారు మాట్లాడుతూ ఈ రోజు రేపు రెండు రోజుల సమ్మెలో భారతదేశంలోని అసంఘటిత అసంఘటిత కార్మికులు , ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేస్తున్నారని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పాలన కార్మికులకు పేద ప్రజలకు వ్యతిరేకంగా వారి విధానాలు ఉన్నాయని పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కార్మిక చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవరిస్తున్నారు ఇదే కాకుండా మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని ఈ దేశాన్ని రక్షించే బాధ్యత ప్రజల మీద ఉందని
రేపు హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు తల పెట్టిన ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని అదేవిధంగా కార్మిక
వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకునే వరకు రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేక గవర్నమెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు స్వరూప, కార్యదర్శి రాజేశ్వరి, కోశాధికారి జ్యోతి, సుమారుగా 100 మంది కార్మికులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.