అహ్మదీయ ముస్లిం సంస్థ ఆధ్వర్యంలో 20 ఫిబ్రవరి రోజున ముస్లిహ్ మౌఊద్ దినోత్సవం

E 69News:-జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో అహ్మదీయ ముస్లిం సంస్థ ఆధ్వర్యంలో 20 ఫిబ్రవరి రోజున ముస్లిహ్ మౌఊద్ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక అహ్మదీయ అధ్యక్షుడు ముహమ్మద్ బాషామియా అధ్యక్షతన జరిగిన సభలో ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం, మరియు స్థానిక మౌల్వీ ముజఫర్ పాషాలు పాల్గొని ప్రసంగించారు.ఈసందర్బంగా సలీం మాట్లాడుతూ, అహ్మదీయ ముస్లిం సంస్థ స్థాపకులు మిర్జా గులాం అహ్మద్ కు 20 ఫిబ్రవరి 1886 రోజున “అల్లాహ్” భవిష్యవాణి ద్వారా నీకు అందమైన తెలివితేటలు గల కుమారుడు జన్మించునని,అతడు ప్రపంచం మొత్తం నీ అభ్యున్నతిని చాటి చెప్పునని,అతను ప్రపంచం మొత్తం గుర్తింపు పొందుతాడని,అతడు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడని,అతడు పవిత్రుడని,అతని పేరు అన్మాయీల్ ,బషీర్,మహ్మూద్,అని చెప్పాడని, అన్నారు. దానికనుగుణంగానే అహ్మదీయ ముస్లిం సంస్థ రెండవ ఖలీఫా (ఉత్తరాదికారి) నేనే ఆ భవిష్యవాణి ప్రకారంగా ముస్లిహ్ మౌఊద్ గా అవతరించానని ప్రకటించుకున్నారని, అన్నారు.తన కృషి వలనే ఐదవ ఖలీఫా (ఉత్తరాదికారి) మిర్జా మస్రూర్ అహ్మద్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచలో 215 దేశాలలో అహ్మదీయ ముస్లిం సంస్థకు పునాది వేసి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.స్థానిక మౌల్వీ ముజఫర్ మాట్లాడుతూ అహ్మదీయ సంఘం అంతర్గత ధార్మిక, ఆర్థిక, అభివృద్ధికి సంఘంను ఐదు శాఖలుగా వయోజన వృద్ధుల సమితి, మహిళా సమితి, యువకుల సమితి,బాలుర సమితి,బాలికల సమితి లు గా విభజించి అభివృద్ధి కి పునాదులు వేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో, స్థానిక అహ్మదీయ సంస్థ ఉపాధ్యక్షుడు నాసిర్, స్థానిక యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ బషీర్, కమిటీ సభ్యులు యాకూబ్ పాషా, మెకానిక్ అంకుషావలీ,మక్తుంఅలీ,రియాజ్,సోహెల్,మస్రూర్, స్ర్తీలు,పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.