మూడవ ప్రపంచ యుద్ధం అనివార్యం-తెలంగాణ ప్రచార కార్యదర్శి,

మూడవ ప్రపంచ యుద్ధం జరుగునని నేటికి 130 సంవత్సరాల క్రితం అహ్మదియ్య సంస్థ స్థాపకులు మిర్జా గులాం అహ్మద్ గారు దైవ వాణి పొంది భవిష్యత్తు వాణి చేశారని దానికి సూచికే ఈ రష్యా ఉక్రెయిన్ ల యుద్ధమని అహ్మదియ్య మౌల్వీ షబ్బీర్ అహ్మద్ అన్నారు. ఈ రోజు జఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో జరిగిన శుక్రవారం ప్రత్యేక ప్రార్థన లో పాల్గొని ఆయన మాట్లాడారు.అహ్మదియ్య 5వ ఖలీఫా మిర్జా మస్రూర్ అహ్మద్ గారు గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా,శాంతియుతంగా,వ్యవహరించాలని న్యాయంగా ఉండాలని ముఖ్యంగా నిజమైన దైవం వైపు దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాల అధ్యక్షులకు ఉత్తరాల ద్వారా హిత బోధచేశారని , అన్ని దేశాలలో మూడవ ప్రపంచ యుద్ధం గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి లీఫ్లేట్స్ ద్వారా ప్రతి చదువుకున్న వ్యక్తులకు తెలియచేయడం జరుగుతుందని, ఈ యుద్ధం ఆగాలని ప్రపంచ అహ్మదీయులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని అన్నారు.అనంతరం అహ్మదియ్య బాలికల (అన్షర తన్వీన్)ఖురాన్ (అరబిక్)ప్రారంభించిన సందర్భంగా వారికి ఖురాన్ గ్రంథమును షబ్బీర్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో అహ్మదియ్య గ్రామ శాఖ అధ్యక్షుడు బాషామియ, యూత్ అధ్యక్షుడు అన్వర్ పాష, స్ధానిక మౌల్వీ ముజఫర్ పాష,యాకూబ్ పాష,బషీర్, అహ్మద్ పాష, నాసిర్, యాకూబ్ మక్తుంఅలీ,రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.