Nprd రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్

వరంగల్ అర్బన్ జిల్లాలో వికలాంగులకు మూడు చక్రాల (స్కూటీ) వాహనాల పంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం చేసిన DWO ను సస్పెండ్ చేయాలి
Nprd రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్)

వరంగల్ అర్బన్ జిల్లాలో వికలాంగులకు మూడు చక్రాల ( స్కూటీ) వాహనాల పంపిణీలో ప్రభుత్వ ఉద్యోగి అయిన లక్కీరెడ్డి సత్యంకు మూడు చక్రాల వాహనాన్ని పంపిణీ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, అనర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసిన DWO మరియు సూపరిండెంట్లను సస్పెండ్ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్ చేశారు.

దివి: 23-04-2021 శుక్రవారం రోజున పట్టణంలోని ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల సహకార సంస్థ నుండి నిరుపేద వికలాంగులకు ప్రభుత్వం మూడు చక్రాల వాహనాల పంపిణీ కోసం నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తే ప్రభుత్వ ఉద్యోగి అయిన లక్కిరెడ్డి సత్యం మూడు చక్రాల వాహనానికి దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు లబ్ధిదారునిగా ఎంపిక చేయడం, మంత్రి చేతుల మీదుగా అనర్హుడు అయినా లక్కిరెడ్డి సత్యంకు వాహనం పంపిణీ చేయించడం అనేక అనుమానాలకు తావిస్తుందని విమర్శించారు. మూడు చక్రాల వాహనానికి ఆన్ లైన్లో దరఖాస్తు ఉన్నత చదువులు చదువుతున్న నిరుద్యోగ వికలాంగులు చేసుకోవాలి. వాహనానికి దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా బోనాఫైడ్ సర్టిఫికెట్ నమోదు చేయించాలి, కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బోనాఫైడ్ సర్టిఫికెట్ ఎట్లా వచ్చిందో దానివెనుక ఉన్న వారెవరో చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతు అనర్హులను లబ్ధిదారులుగా ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరిస్తున్న అధికారులు పైరవికారులకు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నా అనర్హులకు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారని హెద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ తప్పుడు సమాచారంతో మూడు చక్రాల వాహనాన్ని పొందడం చట్టరీత్యా నేరం, తప్పుడు సమాచారం ఇచ్చినా అనర్హులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అర్హులైన నిరుద్యోగ వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకాల్లో అనేక మంది అనర్హులు తప్పుడు సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగాలు పొందినారు తప్పుడు సమాచారంతో వికలాంగుల కోటాలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన నిరుద్యోగ వికలాంగులకు దక్కే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు కేటాయించిన ప్రభుత్వ పథకాలు అన్నింటిని వెనక్కి తీసుకోవాలని, వాటనింటిని అర్హులైన నిరుపేద వికలాంగులకు పంపిణీ చేయాలని తెలిపారు. వరంగల్ అర్బన్లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తీసుకోకుంటే అర్హులైన నిరుద్యోగ వికలాంగులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండవరం శ్రీదేవి, భూమా రజిత, ఉప్పరి వేణు, ఇట్టబోయిన మధు, తోట సురేందర్, ఆకారపు కుమార్, పిట్టల కుమార్, మాలోతు రాజ్ కుమార్, కానుగు బాలనర్సయ్య, నాచు అరుణ, పులి మంజుల, రడపాక యాదగిరి, పులిగిల్ల రాజయ్య, పిట్టల రజిత తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.