రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలని, రైతులకు మద్దతుగా మార్చ్ 26న జరిగే భారత్ బందును జయప్రదం చేయాలని దివి: 25-03-2021 గురువారం రోజున
వడ్లకొండ గ్రామంలో సిపిఎం పార్టీ జనగామ మండల కమిటీ ఆధ్వర్యంలో జీపు జాతను ప్రారంభించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి.అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లో జీపుజాత నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వలన కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛ లభించిందని తెలిపారు. అదాని, అంబానీ, రిలయన్స్, టాటా బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయి అని అన్నారు. రైతులు క్రమంగా వ్యవసాయం వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ చట్టాల్లో కనీస మద్దతు ధర లేకపోవడం సిగ్గుచేటని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న 300 పబ్లిక్ సెక్టార్ లను అమ్మాలని ప్రయత్నిస్తోందని ప్రజల ఆస్తులను పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పజెబుతుందని విమర్శించారు. విశాఖ ఉక్కు, ఎల్ఐసి, రైల్వే, బ్యాంకులు ప్రవేటుపరం చేయడం ద్వారా ఉన్న ఉద్యోగాలు కుదించడానికి ప్రయత్నిస్తోందన్నారు. రోజు రోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, పెట్రోల్ ,డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని ,అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో Cpm మండల కార్యదర్శి పోత్కనూరి ఉపేందర్, సాంబరాజు యాదగిరి, ర్. మిత్యా నాయక్, పంపర. మల్లేశం, గురజాల లక్ష్మినర్సింహారెడ్డి, సికందర్, గుండెల్లి రాజు. బొట్టు సూరి, తదితరులు పాల్గొన్నారు.
