మెట్రో రైలును సంగారెడ్డి వరకు పొడిగించాలి


మార్చి 19న పఠాన్ చేరు నుండి సంగారెడ్డి వరకు సీపీఎం పాదయాత్ర
సీపీఎం జిల్లా కార్యదర్శి బి. మల్లేషం

మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించాలని, ఈ నెల 19వ తేదీన పటాన్చెరు నుండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి బి మల్లేశం తెలిపారు. ఈ రోడ్డు సంగారెడ్డి జిల్లా కార్యాలయం లో పాదయాత్ర పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ పాలకుల నిర్లక్షమే సంగారెడ్డి కి రైల్ నోచుకోలేదని తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కేంద్రం కూతవేటు దూరంలో ఉన్న నేటికీ రైల్వే లైన్ లేక అనేక రకాలుగా అభివృద్ధిలో ఆగిపోయాయని తెలిపారు.
ఆసియా ఖండం లో నే అతి పెద్ద పారిశ్రామిక వాడ పటాన్చెరన్నారు. పటాన్చెరు తో పాటు ఇస్నాపూర్, పాశమైలారం, సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దీంతో అనేక మంది కార్మకులకు రావాణ ప్రాధాన్యత ఎంతోవుందన్నారు. వివిధ ప్రాంతాల నుండి ఇక్కడి కి వేలాది మంది రాకపోకలు జరుగుతున్నాయి అని తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు మార్చి 19న పటాన్చేరు నుండి సంగారెడ్డి వరకు జరిగే పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జయరాజు, రాజయ్య, మాణిక్యం, రాంచందర్, సాయిలు, నర్సింహులు, లక్ష్మయ్యా తది తరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.