parakala news cpmnews e69news telugunews

పరకాల. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకి సిద్దం కావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దోగ్గెల తిరుపతి పిలునిచ్చారు.
ఈరోజు మేడే సందర్భంగా పరకాల బస్టాండ్ దగ్గర రాజదాని టీ షాప్ మూల మీద
సీపీఎం జెండాను తిరుపతి, పరకాల హరిజన వాడలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం జెండాను బొచ్చు కళ్యాణ్, కూరగాయల మార్కెట్ లో సిఐటియు జెండాను రాజు,సంపత్ లేబర్ అడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కుమార్ లు ఎగరవేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు …. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పనిగంటల తగ్గింపు కోసం 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో మరణించిన కార్మికుల స్ఫూర్తితో ఏర్పడిన ఎర్ర జెండా నాటి నుంచి నేటి వరకు హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహిస్తుందని, ప్రజల సమస్యనే ప్రధానంగా ఎజెండాగా పనిచేస్తుందని, పోరాటాలు చేసి పనిగంటలు తగ్గించుకున్న కార్మికుల హక్కులను నేటి పాలకులు విస్మరిస్తున్నారని, లేబర్ కోడ్ లను తీసుకువచ్చి పనిగంటలు పెంచుతూ కనీస హక్కులను లేకుండా చేస్తున్నారని, పరిశ్రమల్లో కార్మికుల కు యూనియన్లు పెట్టుకునే హక్కు ను తొలగించి వేస్తున్నారని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే చట్టాలను తీసుకు వచ్చి కార్మికులను మరోసారి దోపిడికి గురి చేసే ప్రయత్నాన్ని బిజెపి ప్రభుత్వం చేసేందుకు కుట్ర ఉందని రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, ఆర్టీసీ లాంటి సంస్థల్లో కార్మిక సంఘాలను నిషేధించడం విడ్డూరమన్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని అణగా తొక్కుతున్నారని విమర్శించారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్న వారి గురించి మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదని, మేడే స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని కార్మికులు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మడికొండ వరుణ్, ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షులు మడికొండ ప్రశాంత్, సిఐటియు నాయకులు బోట్ల మహేందర్, కొడపాక సాంబయ్య, రాజు రవీందర్ లు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.