#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69News

పినపాక ప్రభాకర్ రాష్ట్ర కన్వీనర్ కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పు చేయాలని ప్రయత్నించటం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు పరం చేయటం లాంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్మిక రంగాన్నే నిర్వీర్యం చేయాలని, కార్మికులను కట్టు భానిసలుగా చేసి యాజమాన్యాలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్రం ప్రయత్నాలను ఐక్యంగా తిప్పి కొట్టాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ఇప్పటికే కరోనా కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోకుండా సోద్యం చూస్తోంది. ఇప్పటికే కరోనా ను అడ్డం పెట్టుకొని కార్మికులను తొలగించటం, పరిశ్రమలను చట్ట వ్యతిరేకంగా మూసివేత లాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా యాజమాన్యాలకు వత్తాసు పలకటం విడ్డూరం. ప్రావిడెంట్ ఫండ్ కట్టకుండా ఎగ వేసిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పరిశ్రమలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఇప్పటికే అనేక పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు, సంఘాలు ఎన్ని ఉన్నా, ఎవరి జెండా అజెండా వేరైనా కనీసం ఈ మేడే నుండైనా సమస్యలపై ఐక్య పోరాటాలకు నాంది పలుకాలిఅని, కొంత మంది యూనియన్ నాయకుల ముసుగులో యాజమాన్యాలకు సలహాదారులుగా మారి కార్మికుల తొలగింపుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది సరైనది కాదు. అందరూ కార్మిక సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలు నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు.

అలానే ఈ మేడే కు షాద్ నగర్ ఎంపిడిఓ కార్యాలయంలో జరిగే మెగా రక్త దాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.