పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్గొండ..

  మతం పేరుతోరాజకీయాలుచేస్తుా అదికారం సాదించడానికి దేశంలో క్రిష్టియన్,ముస్లీం మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా డిసెంబర్ 1న నిరసనలో పాల్గొనాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి వత్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. సోమవారం రోజున కనగల్ మండల సిపిఎం పార్టీ సమావేశం సోము ముత్యాలు అద్యక్షతన కనగల్ వేముల నాగయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మతహింస పెరిగి పోతుందనీ ప్రజల్లో వున్న భక్తి అభిమానాన్ని తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకొనీ మంత్రులు యంయల్ఎ లు ఎంపీ లు బహిరంగంగా విద్వేషాలను రెచ్చగొడురున్నారని అన్నారు.
  మానవహక్కుల సంఘాల నివేదిక ప్రకారం 2021 తొమ్మిది నెలల కాలంలో క్రైస్తవ ప్రార్దన స్థలాలపై 300 దాడులు చెసీ ఆదివాసీలు ధళిత ముస్లీం వర్గాలకు చెందిన వారిపైనా దాడులు చేశారనీ అన్నారు. 
   మన రాజ్యాంగం మతప్రమేయం లేనీ రాజ్యాంగంమనీ మతపరమైన దాడులు చేయడమంటే రాజ్యాంగ బద్ద హక్కులపై దాడీ చేయడమేన నీ అన్నారు. దాడులకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన నిరసన దినంగా పాటించాలనీ సిపిఎం పార్టీ పిలుపులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనీ కోరారు..ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి కందుల సైదులు బ్రహ్మానందరెడ్డి సోము ముత్యాలు యండీ ఆక్రం సుల్తానా లింగయ్య తదితరులు పాల్గొన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.