మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించాలని కోరుతూ వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి జబ్బార్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మున్నీరు అహమ్మద్, ఉపాధ్యక్షులు గయాసుద్దీన్ , జిల్లా నాయకులు పాల్గొన్నారు.