27న ఇందిరాపార్క్ వద్ద ధర్నా
-జయప్రదం చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపు.

మైనారిటీ డ్రైవర్లకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఆవాజ్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీల ఆధ్వర్యంలో ఈనెల 27న ఇందిరాపార్క్ వద్ద జరుగనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు.
ఆవాజ్ రూపోందించిన ధర్నా పోస్టర్ ను ఈరోజు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం హాల్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ హైదరాబాద్ లో సుమారు 50 వేల మంది మైనారిటీ డ్రైవర్లు ఆటోలు, ట్రాలీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గత పదిహేను రోజుల నుంచి మైనారిటీ డ్రైవర్ల సమస్యలపై ఆవాజ్ హైదరాబాద్ కమిటీల ఆధ్వర్యంలో అనేక సర్వేలు నిర్వహించి సమస్యలు గుర్తించాము. డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. కోవిడ్ కారణంగా మైనారిటీ ఆటో డ్రైవర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. అప్పులతో, అర్థాకలితో బతుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కిరాయి ఆటోలు, ఫైనాన్స్ ఆటోలు నడిపేవారు కిరాయిలు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక అప్పుల పాలై మైనార్టీ డ్రైవర్లు ఫైనాన్సియర్స్ ఒత్తిడికి లోనవుతున్నారు. ఫైనాన్సర్ ఇళ్ల పైకి వచ్చి దాడులు చేస్తున్నారని అన్నారు. ఇంటి ఆర్థిక సమస్యలు , ఫైనాన్స్ కిస్తీల సమస్యలు, ఆటో యాజమాన్య ఒత్తిళ్ళను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గతంలో సుధీర్ కమిషన్, జస్టిస్ సచార్ కమిటీ రిపోర్టులలో ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఉన్నారని, వీరికి తక్షణమే ప్రభుత్వాలు బడ్జెట్లో పది శాతం ఇచ్చి ఆదుకోవాలని సిఫార్సు చేశాయని, అయినా ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. పాలకులు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ అమలుకు నోచుకోవడంలేదని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27వ తేదీన, ఉదయం 11:00 గంటలకు ఇందిరాపార్క్ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఈ ధర్నాలో మైనార్టీ ఆటో డ్రైవర్లంతా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శులు అబ్దుల్ సత్తార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ అలీ, రాష్ట్ర నాయకులు అజీజ్ అహ్మద్ ఖాన్, బాబర్ ఖాన్ , షేక్ యాకూబ్ పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.