మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా .

మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి.

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

తెలంగాణా మైనారిటీ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ కోదాడ డివిజన్ సామాజిక సేవలు అభినందనీయమని కోదాడ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో ఇటీవల గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు అయేషా,ఆసియా లకు అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ వంతు కర్తవ్యం గా విరాళంగా సేకరించి న 1లక్షా40 వేల రు.లను చెక్కును ఎమ్మెల్యే అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……. వ్యక్తిగతంగా పరిష్కారం కానీ సమస్యలు సంఘ పరంగా చేయడం సులభం అవుతుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మైనార్టీ ఉద్యోగుల సంఘం ఆదర్శంగా నిలిచిందన్నారు. మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మైనార్టీ ఉద్యోగుల సంఘన్నీ అభినందించారు. ఈ సందర్భంగా కోదాడ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాల గా అప్ గ్రేడ్ చేయాలని, పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మైనారిటీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలు సిద్ధం కావడానికి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం మెడిసిన్ సీట్లు సాధించిన విద్యార్థినిలకు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, డాక్టరేట్ సాధించిన వారికి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కోదాడ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాన్పాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ ఎంపిపీ చింతా కవిత రాధా రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఒంటిపులి నాగరాజు, టీఎస్ మీసాకోదాడ డివిజన్ గౌరవ సలహాదారులు ఎం.డి .సలీం షరీఫ్, జిల్లా అధ్యక్షులు ఎం.డి యాసీన్, జిల్లా కార్యదర్శి బడేసాహెబ్, రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎం ఎండి ఖలీల్ అహ్మద్, గ్రంధాలయ చైర్మన్ రహీం, అధ్యక్షులు జాన్ పాషా, ప్రధాన కార్యదర్శి మైనోద్దీన్, శహనాజ్,కమర్ సుల్తానా, సాహెబ్ అలీ,బాబు,కన్నం సాహెబ్, సత్తార్, యాకుబ్ అలీ,హమీద్, మిరజోద్దీన్,షఫీ,నాయకులు రాయపూడి వెంకట నారాయణ, ఈదుల కృష్ణయ్య,kln ప్రసాద్,ఖాజా,పలువురు కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.