మొహర్రం సందర్భంగా షర్మిలక్క ప్రత్యేక ప్రార్థనలు

మొహర్రం పురస్కరించుకుని హైదరాబాద్ లోని డబీర్ పురా బీబీకా ఆలంలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మతపెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి చాదర్ సమర్పించారు. మొహర్రం అమరవీరుల త్యాగ దినమని, ధర్మం గెలవడానికి హజరత్ ఇమామ్ హుస్సేన్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు. మొహర్రం లౌకికవాదానికి ప్రతీక అని ముస్లింలతో పాటు ఇతర వర్గాలు కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మైనార్టీలంటే మహానేత వైయస్ఆర్ గారికి ఎంతో అభిమానం ఉండేదని, మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించి.. ఉద్యోగ, ఉపాధి కల్పనలో పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ శ్రీ వాడుక రాజగోపాల్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తబా అహ్మద్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.