janagama news citu news

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు

జనగామ: జిల్లా లోని మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పిఆర్సి 30 శాతాన్ని వర్తింపజేసి వారి వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు డిమాండ్ చేశారు
జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ లో పనిచేస్తున్న సిబ్బందికి 30శాతం పిఆర్సి పెంచి వేతనాలు ఇస్తున్నప్పటికీ సంవత్సరం గడిచినా జనగామ జిల్లాలో మాత్రం పెంచిన పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇది సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు అనేకసార్లు సి ఐ టి యు మరియు మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది మిగతా జిల్లాల్లో ఇస్తున్నారు జనగామ జిల్లా లో ఇవ్వండి అని కోరినప్పటికీ ఇవ్వక పోవడంలో అంతర్యం ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో 24 గంటలు విద్యార్థులకు అందుబాటులో మోడల్ స్కూల్ హాస్టల్ లోనే ఉంటూ వారికి సేవలు చేస్తున్న మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది సమస్యల పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి వారి సమస్యలను పరిష్కరించాలని తక్షణమే 30 శాతం పిఆర్సి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.