jayashanker news

పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

  • మోరంచ పరివాహక ప్రాంత రైతులకు న్యాయం చేయాలి.. భూపాలపల్లి:
    గత వారం రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో, సోమవారము (ఈరోజు)వాగు వరద ఉధృతిని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మోరంచవాగు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఏటా మోరంచవాగు పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలు దెబ్బతింటున్నాయని, భూములు కోతకు గురవుతున్నాయని అన్నారు. గణపురం మండలంలోని చెరువులు బ్యాక్ వాటర్ వల్ల వరి నాట్లు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మోరంచవాగు వరద ఉధృతికి పంటలు నష్టం పోవడం, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడం, పరిపాటిగా మారిందే కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారాన్ని అందించిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ జిల్లా నాయకులు సూరం వీరేందర్, దూడపాక శంకర్, లక్ష్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఒద్ధుల విజయ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.