మ్మెల్యే రాజయ్య శ్రీ రాముని అవమానించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శ్రీ రాముని అవమానపరిచే విధంగా జై శ్రీరామ్ అంటే దళితులు అభివృద్ధి చెందుతారా అని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బిజెపి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జి పేరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు.శ్రీరాముని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీరామనవమి ఉత్సవాలకు రాకుండా అడ్డుకుంటామని చెప్పడంతో భయపడిన ఎమ్మెల్యే రాజయ్య రాకుండా ఉండడం వల్ల విడిచి పెట్టేది లేదు ఎట్టి పరిస్థితిలో కూడా బహిరంగంగా క్షమాపణ బేషరతుగా చెప్పేంతవరకు స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లో తిరిగనివ్వమని హెచ్చరిస్తూ శ్రీరాముడు అంటే అందరి దేవుడు అని అందరి బాగోగులు చూసి మురిసిపోయే గొప్ప దేవుడు అని అన్నారు ఎవరు ఏది కోరుకున్న కూడా కొంగుబంగారమై నిలిచి వారిని ఆదుకుంటాడని అన్నారు శ్రీరామనవమికి రాకుండా ఈ రోజున తప్పించుకోవచ్చు కానీ నియోజకవర్గంలో తిరుగకుండా అడ్డుకుంటామని క్షమాపణ చెప్పే అంతవరకు విడిచిపెట్టేది లేదని హెచ్చరిక చేసినారు టిఆర్ఎస్ పార్టీలో హిందువులు ఎంతో మంది ఉన్నా కూడా కనీసం స్పందించక పోవడం విచారకరం ఇప్పటికైనా దేవుని విమర్శించిన తాటికొండ రాజయ్యని క్షమాపణ చెప్పించాలని కోరుతూ అదేవిధంగా అన్ని పార్టీలలో ఉన్న హిందువులు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణ చెప్పేంతవరకు బిజెపితో కలిసి రావాలని కోరుకుంటున్నాం స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లోని లింగాల ఘనపురం మండలం లో ఉన్న నవాబుపేట మరియు జీడికల్ గ్రామాలలో శ్రీరామ నవమి సందర్భంగా జరుగుతున్నశ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి వస్తాడు అని తెలిసి అక్కడికి చేరుకోగా పోలీసులు నవాబుపేట గ్రామంలో బిజెపి స్టేషన్గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పేరు వెంకటేశ్వర్లుని జనగాం జిల్లా కార్యదర్శి సారి బుడ్డి రమేష్ రెడ్డిని అధికార ప్రతినిధి మంద వెంకటేశంని జఫర్ గడ్డ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఇల్లందుల సారయ్యని స్టేషన్గన్పూర్ మండల నాయకులు పల్లె నాగరాజుని అరెస్టు చేయడం విచారకరమని అన్నారు.బిజెపి స్టేషన్గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పేరుమాండ్ల వెంకటేశ్వర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు వినకుండాఅరెస్టు చేసి లింగాలఘనపురం పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు.అడ్డుకోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేసిన ఎవరు అడ్డుకున్న కూడా రాజయ్య క్షమాపణ చెప్పే వరకు విశ్రమించేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షుడు సోమిడి వెంకట్ రెడ్డి గారు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముక్క స్వామి సీనియర్ జిల్లా నాయకులు మోత్కుపల్లి ఆగయ్య బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ప్రజ్ఞా పురం ఆంజనేయులు లింగాల ఘనపురం మండల ప్రధాన కార్యదర్శి కొండ బోయిన సంపత్ నాయకులు సందీప్ చిరంజీవి నరేష్ పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.