|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,స్టేషన్ ఘనపూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు
ఈ69న్యూస్ జఫర్గడ్/ఏప్రిల్05
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు జఫర్గడ్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమాల్లో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్,తెరాస జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి,స్టేషన్ ఘనపూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు పాల్గొని మాట్లాడారు.యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగొచ్చే వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయపాల్ రెడ్డి,ఎంపీపీ రడపాక సుదర్శన్,జడ్పీటీసీ ఇల్లందుల బేబిశ్రీనువాస్,పిఏసిఎస్ చైర్మన్ కరుణాకర్,వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య,మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ కడారి శంకర్,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి,ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు చిలువేరు శివయ్య, స్థానిక ఎంపీటీసీలు జ్యోతి రజితయాకయ్య,ఇల్లందుల స్రవంతిమొగలి,మండల సర్పంచులు,ఎంపిటిసిలు, రైతు కోఆర్డినేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు,పిఏసిఎస్ డైరెక్టర్లు,రైతు బంధు సమితి సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నాయకులు, యువజన సంఘాలు నాయకులు,కార్యకర్తలు,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.