|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

మీకు చేత కాకపోతే పది వేల కోట్లు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ కొంటుంది
టిఆర్ఎస్ బిజెపి నాటకాలు ఆపండి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చి రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చర్యలు చేపట్టాలని, లేనియెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కుమారుడు సూర్య గారు
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వెంకటా పూర్ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్య నారాయణ,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, బానో త్ భాస్కర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,అసంఘిటిత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు బాగ్ వాన్ రెడ్డి,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి హైమద్,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనె టి శ్యాం,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్,
ఫిషర్ మేన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోరే రాజమౌళి,గ్రామ కమిటీ అధ్యక్షుడు జోషి, పచ్చి మట్ల రాంబాబు,గజా రాజు
బాలరాజు,సహకార సంఘం డైరెక్టర్ ఓజ్జుల రవి,ప్రసాద్,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.