కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లోని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య ఆదేశానుసారం జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో రైతుల ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగురవేసి,నల్ల జెండాలతో,డప్పు చప్పుళ్లతో గ్రామంలో తిరిగి నిరసన తెలిపి,ఊరి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య,స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు మారపల్లి కుమార్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాపర్తి రాజ్ కుమార్,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి,పిఏసిఎస్ డైరెక్టర్ లోకిని బిక్షపమ్మసాయిలు పార్టీ శ్రేణులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.