E69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి అన్నారు.శనివారం మండల కేంద్రంలో చిట్యాల మండల టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తౌటం నవీన్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల యూత్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా గండ్ర గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో యువతను సన్మార్గములో నడిపించుటకు ముందు ఉంది అని అన్నారు.చిట్యాల మాండలములో ఉన్న అన్ని గ్రామాల యూత్ నాయకులతో గ్రామాలకి కావలిసిన సదుపాయాలు ,యువతలో నైపుణ్యం కల్పించుటకు కావలిసిన అవసరాలను పై చర్చ గోష్ఠి నిర్వహించారు. క్షుణ్ణంగా గా విన్న గౌతమ్ రెడ్డి త్వరలోనే అన్ని సదుపాయాలు పూర్తి చేయుటకు భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర వెంకట రమణ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అని ప్రతి ఒక్క కార్యకర్తకు గౌరవ ఎమ్మెల్యే సముచిత స్థానం కలిపిస్తారని తెలిపారు .ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా తెలియ పరచాలని వారు కోరారు.ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం వలన యువతకు మరెన్నో సదుపాయాలను కలిపించడం జరుగుతుంది అన్నారు.భవిష్యత్ లో యువత కోసం మెడికల్ క్యాంపులు,స్పోర్ట్ మీట్లు,లైబ్రరీల కల్పనకు తప్పకుండా కృషి చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి ,టిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎరుగొండ రాజేందర్ గౌడ్,యూత్ సీనియర్ నాయలు మార్క నగేష్,దామెరా రాజు ,ప్రవీణ్ కుమార్ పటేల్ ,చిట్యాల టౌన్ యూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాసు రమేష్, మొలుగురి రాకేష్,అన్ని గ్రామాల యూత్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు,కార్యవర్గ సభ్యులు ,యూత్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.