యువత సంస్కరించబడనిదే సమాజ సంస్కరణ చేయలేము

-జిల్లా, జాతీయ అహ్మదీయ ముస్లిం సంస్థ ప్రతినిధులు
E69NEWS :-వరంగల్ రూరల్ ఆత్మకూరు మండలం లోని హౌజ్ బుజుర్గ్ కటాక్ష పూర్ గ్రామంలో అహ్మదీయ ముస్లిం సంస్థ , స్థానిక మౌల్వీ సయ్యద్ కరీం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం అధ్యక్షతన ధార్మిక సభ నిర్వహించారు.దీనికి ముఖ్య అతిధులుగా అహ్మదీయ ముస్లిం సంస్థ, కేంద్రమైన ఖాదియాన్, పంజాబ్ రాష్ట్రం కు చెందిన జాతీయ అహ్మదీయ యువజన సంఘం ప్రతినిధులు,గుల్ఫాం అహ్మద్,ఖాలిద్ అహ్మద్ లు పాల్గొని ప్రసంగించారు.వారు మాట్లాడుతూ నేటి యువత చెడు సాహసాల వలన చెడు అలవాట్లకు పాల్పడి సమాజానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని, కాని అహ్మదీయ సంస్థ లో దానికి తావు లేదని,ఎందుకంటే అహ్మదీయ సంస్థ లో ఒక బలమైన వ్యవస్థ ఉందని దిశానిర్దేశాలు చేసే ధార్మిక పండితులు ఉన్నారని ముఖ్యంగా మార్గ దర్శకాలు చేసే ఖిలాఫత్ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు.యువత సంస్కరించబడనిదే సమాజ సంస్కరణ జరుగదని యువత సరియైన మార్గములో నడవాలంటే ధార్మికంగా ఎదగాలన్నారు అనంతరం బాల బాలికలకు ధార్మిక విద్య, మరియు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమం లో స్థానికులు, స్థానిక యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్ వలీ, యాకూబ్ పాషా కుర్రం ,ముబారక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.