ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశాల మేరకు డాక్టర్ బిందు శ్రీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ , లేప్రోసి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల అవగాహన ర్యాలీ ని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ప్రారంభించారు. ర్యాలీ జిల్లా ఆసుపత్రి నుండి నెహ్రూ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణాలను కాపాడి ప్రాణదాతలు గా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గిరిజన ప్రజలు అధికంగా ఉన్నారని, జిల్లాలో రక్తలేమి తో చాలామంది బాధపడుతున్నారని, కావున మీరు ఇచ్చిన రక్తం వారికి మరియు ప్రసవ, అత్యవసర సమయంలో రక్తము అవసరం వచ్చినప్పుడు రక్తము ఉపయోగపడి వారి ప్రాణాలను నిలుపుతుంది కావున అందరు కూడా అవగాహనతో ముందుకు వచ్చి జిల్లాలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అంబరీష, డాక్టర్ నెహ్రూ నాయక్ రెడ్ క్రాస్, డాక్టర్ భార్గవ్ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి, పి రవీందర్ రావు డిప్యూటీ పార మెడికల్ ఆఫసర్, నవీన్ రాజ్ కుమార్ ఆరోగ్య విద్యా బోధకులు, డి కిరణ్ కుమార్, ఎం వెంకన్న, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మోహన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.