రఘునాథపల్లి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో

రఘునాథపల్లి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లో పాల్గొన్న
తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ తాటికొండ రాజయ్య
ప్రభుత్వ ఉద్యోగులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు డాక్టర్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వేసి అత్యధిక మెజారిటీతో గెల్పించాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యేమాట్లాడుతూ….
ఈరోజు రఘునాథపల్లి మండలంలోని ప్రజా ప్రతినిదులు,ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు డాక్టర్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వేయాలని కోరగా ఉద్యోగులు అందరూ సానుకూలంగా స్పందించారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం లో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్య భూమిక పోషించారు అన్నారు.
-బిజెపి నాయకులు భరితెగించి తిట్ల పురాణానికి శ్రీకారం చుడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు కర్రు కాల్చి వాత పెడితే కోలుకోలేని పరిస్తితి బిజెపి నాయకులకు ఏర్పడుతుందన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం నల్లేరు మీద నడకే, మా ప్రయత్నమంతా మెజారిటీ కోసమే అన్నారు.
మా నియోజకవర్గ ముద్దుబిడ్డ కాబట్టి మాపై మరింత భాద్యత ఉంటుంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లను పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత గా వేయించి కానుకగా ఇస్తాం అన్నారు.రాబోయే రోజుల్లో పట్టభద్రులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నియోజకవర్గ భాద్యుడిగా పట్టభద్రులను కాపాడుకునే బాధ్యత నాది అన్నారు.
ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు శ్రీ వై కుమార్ గౌడ్ గారు, జెడ్పీటీసీ శ్రీ బొల్లం అజయ్ గారు,సర్పంచ్ శ్రీ పోకల శివ కుమార్ గారు, శ్రీ నామాల బుచ్చయ్య , మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సునీత , మండల ఇంఛార్జి వెంకటస్వామి ,జిల్లా యువజన నాయకులు కుర్ర కమలాకర్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు దుబ్బాక హరీష్ గౌడ్ , శ్రీ కొర్ర రాజేందర్ నాయక్ , శ్రీ బల్నె పరుషరామ్ , ముప్పిడి సాంబ , మండల ప్రజా ప్రతినిదులు, నాయకులు , ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ లు,తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.