రఘునాథపాలెం కస్తూరిబా ఎదుట సీట్లు పెంచాలని ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. అనంతరం ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు మాట్లాడుతూ :- రఘునాథపాలెంలోని కస్తూరిబా స్కూల్స్లో విద్యార్థులకు 40 సీట్లు ఉన్నాయని గిరిజన ప్రాంతాల నుండి వస్తున్న విద్యార్థులకు సీట్లు కరువయ్యాయని, స్కూళ్లలో బల్లాలు లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, స్కూలు చుట్టూ ప్రహరీగోడ ఏర్పాటు చేయాలని, అలాగే కాలేజీ విద్యార్థులకు ఉపాధ్యాయులు లేరు… సరిపడా ల్యాబ్ ఎక్కువ మెంట్స్ కూడా లేవు దీనివల్ల విద్యార్థులు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు… ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యూ జిల్లా నాయకులు నవిన్ రెడ్డి, గిరిజన సంఘం మండల అధ్యక్షులు గుగులొత్ కుమార్, డీ.వై.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి బషీర్ ఉద్దీన్, నాగరాజు, బాణావత్ ఉదయ్, సత్తెనపల్లి నరేష్, మంగపతి తదితరులు పాల్గొన్నారు