50 సంవత్సరాలు నిండిన రజకులకు వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలి.*

రేపు తహసీల్దార్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయండి.
—————-=———–
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఫైళ్ల ఆశయ్య)

రజకులకు ప్రత్యేక “రక్షణ చట్టం” చేయాలని, 50 సంవత్సరాలు నిండిన రజకులకు వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివి: 26-06-2022 ఆదివారం రోజున తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా 2వ మహాసభలు జనగామ పట్టణ కేంద్రంలోని కామాక్షి పంక్షన్ హాల్ నందు రెండవరోజు మహాసభల కొనసాగింపులో భాగంగా ఈ మహాసభలకు చిట్యాల సమ్మయ్య మరియు మైలవరపు వెంకటేశ్వర్లు అధ్యక్ష వర్గంగా ఏర్పాటు చేసిన ఈ మహాసభలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పైళ్ల ఆశయ్య పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు. సమాజంలో తీవ్రమైన వివక్ష ప్రదర్శిస్తోందని అన్నారు. వృత్తి దెబ్బతిని రజకులు కూలీలుగా మారుతున్నారు. ఈ సందర్బంగా మహాసభలో ముఖ్యమైన తీర్మానాలు ప్రవేశపెట్టడమైనది.
అవి

1). రజక బంధు ఏర్పాటు చేసి 10 లక్షల ఋణం ఇవ్వాలి.

2). రజకులకు ప్రత్యేక “రక్షణ చట్టం” చేయాలి.

3). జనగామ జిల్లాకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలి.

4). చాకిరేవు భూములు, దోభీఘాట్ల స్థలాలు, చాకలి మాన్యం భూములు రజకులకే ఇవ్వాలి.

5). రజకులకు రూ॥ 5 లక్షల భీమా సౌకర్యం కల్పించాలి.

7). 50 సం॥లు నిండిన రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి.

6). అన్ని మండలాలలో మోడ్రన్ దోభీఘాట్లు నిర్మించాలి.

ఈ సందర్బంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన జనగామ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
రజక వృత్తిదారుల నూతన జిల్లా కమిటీ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు కొలిపాక నరసింహులు.
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు మైలారం వెంకటేశ్వర్లు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా ప్రధానకార్యదర్శి ఎదునూరి మాదార్ లను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసభ ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. అనంతరం సంఘం నూతన జిల్లా ప్రధానకార్యదర్శి ఎదునూరి మదార్ మాట్లాడుతూ పైన తెలిపిన ప్రధాన డిమాండ్ల సాధనకై రేపు (అనగా 27-06-2022 సోమవారం) జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు తలపెట్టిన ధర్నాలో రజకులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజుల నరేష్, పైండ్ల యాకయ్య, రెడ్డిరాజుల నారాయణ, పొన్నం శ్రీనివాస్, ఎం వెంకటేష్, వడ్డెమాను శ్రీనివాస్, సాంబరాజు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.